'డివిజన్ స్థాయి సెమినార్‌ను విజయవంతం చేయండి'

RR: ఈనెల 14వ తేదీన షాద్‌నగర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో నిర్వహించనున్న డివిజన్ స్థాయి సెమినార్‌ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు.