VIDEO: 'అందరి కష్టంతోనే ఎక్కువ సీట్లు గెలవగలిగాం'
NZB: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో సామాన్య కార్యకర్త నుండి ఎంపీ దాకా ప్రతి ఒక్కరి కష్టంతోనే ఇందూరులో ఎక్కువ సీట్లు గెలిచామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఒత్తిళ్లకు లొంగకుండా కార్యకర్తలు పనిచేశారని కొనియాడారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందన్నారు.