భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి: కలెక్టర్

భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి: కలెక్టర్

NRPT: జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ బుధవారం భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 'భూగర్భజలాల వినియోగం - సంరక్షణ'పై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భూగర్భ జలాల వివరాలు, లభ్యత, వినియోగం, నీటి సంరక్షణ చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా క్రియాశీలక భూగర్భ జల వనరుల పుస్తకాన్ని విడుదల చేశారు.