నంద్యాలలో జన ఔషధీ కేంద్రం ప్రారంభం
నంద్యాలలో జన ఔషధీ మెడికల్ స్టోర్‌ను ఇవాళ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యమన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రానికి సంస్థలు ఆర్థిక సహాయం అందించాయి. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.