నిర్మాణ దశలో రోడ్డు.. ఇబ్బందుల్లో వాహనదారులు

NLG: పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి గుండ్లపల్లి, రేగట్టే వరకు నిర్మిస్తున్న 2 వరుసల రోడ్డులో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఈ రోడ్డులో ఇసుక ట్రాక్టర్లు ఎక్కువగా ప్రయాణించడంతో కంకర లేచి రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారులు వేగంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.