నెల్లూరు ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 65 సంవత్సరాల వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. చుట్టుప్రక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. దర్గా మిట్ట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.