VIDEO: గ్రానైట్‌పై మాట్లాడిన కవిత
KNR: మేమే మంత్రులం అంటూ గ్రానైట్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కరీంనగర్‌లో అన్నారు. 'ప్రకృతి వనరులు కాపాడుకోవాలి, గ్రానైట్ క్వారీల వల్ల ఇబ్బందులు వచ్చేటట్లు చేయకూడదు' అని ఆమె సూచించారు. గ్రానైట్ లారీల వల్ల జిల్లాలో ఉన్న రోడ్లు దెబ్బతింటున్నాయని, పర్యావరణం పూర్తిగా దుమ్ముధూళితో నిండిపోయిందన్నారు.