వేసవి క్రీడా శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
NRPT: గ్రామాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నారాయణపేట జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి మే 7 వరకు వివిధ క్రీడాంశాలలో శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. స్థానికంగా ఉండే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.