VIDEO: రోడ్డు ప్రమాదం.. గాయపడిన ఉపాధ్యాయులు
మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు కుమ్మరి కుంట తండా సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటోను వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.