VIDEO: కడపలో గంజాయి పట్టివేత.. ఒకరు అరెస్ట్
కడప కేసీ కెనాల్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇస్మాయిల్ బాషాను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయి, స్కూటర్‌ను సీజ్ చేసినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. పరారీలో ఉన్న రౌడీషీటర్ అరాఫత్, మహమ్మద్ అలీ కోసం గాలిస్తున్నామన్నారు. కక్షతో శత్రువుల ఇళ్లలో గంజాయి పెట్టి ఇరికించేందుకు అతడు కుట్ర పన్నినట్లు తేలిందన్నారు.