23న రాజంలో సందడి చేయనున్న జబర్దస్త్ నటులు
VZM: రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతరకు వస్తున్న వారిని అలరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 23న (సోమవారం) జబర్దస్త్ హైపర్ ఆది, రేంజింగ్ రాజు, శాంతి స్వరూప్‌తో పాటు పలువురు నటులు జాతరలో సందడి చేయనున్నట్లు వారు చెప్పారు.