చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

PLD: చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌లోని ఒక బార్ సమీపంలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన బేల్దారి మేస్త్రీ అయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.