దక్షిణకొరియా క్షిపణి వ్యవస్థకు డిమాండ్..!
యుద్ధం నేపథ్యంలో దక్షిణ కొరియా గగనతల క్షిపణి వ్యవస్థకు డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. యూఏఈ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ విజయం సాధించినట్లు సమాచారం. దీంతో దాని కొనుగోలుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయని ఆ దేశ మంత్రి ఒకరు వెల్లడించారు. కాగా, ఉత్తర కొరియా నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకునేందుకు దక్షిణ కొరియా చెయోంగుంగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది.