కార్యాలయంలోకి చేరిన వర్షపు నీరు

KMR: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాన్సువాడ పట్టణంలోని మధ్యనిషేద, అబ్కారి కార్యాలయంలోకి నీరు చేరింది. దీనివల్ల సిబ్బంది విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతంలో తక్కువ ఎత్తులో కార్యాలయం నిర్మించడమే ఈ సమస్యకు కారణమని స్థానికులు తెలిపారు.