కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత
SRD: మండల కేంద్రమైన కంగ్టి గిరిజన గురుకుల బాలుర రెసిడెన్షియల్ ఇంటర్మీడియెట్ కళాశాలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. సెకండియర్‌లో మనూరు మండలం మాయికోడ్‌కు చెందిన బి.ఈశ్వర్ సీఈసీలో 928 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఫస్టియర్లో జి.కార్తిక్ 450, ఈ. ఈశ్వర్ 443 మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.