VIDEO: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

VIDEO: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో బైక్‌పై ప్రయాణిస్తున్న పట్టాపంచల శేషగిరి (21) అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.