'విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యం'
గుంటూరు జిల్లా పొన్నూరు ఐసీడీఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ICDS ప్రాజెక్ట్ అధికారిని ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమని తెలిపారు. నేటి తరంలో ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒక మహిళ ఎంతో పరిపుష్టి చెందిందని, ప్రతి రంగంలో మహిళకు సగభాగం ఇవ్వాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉందని ఆమె వివరించారు.