VIDEO: అల్లూరి పార్కును సందర్శించిన స్పీకర్

Akp: స్పీకర్ చింతకాయలు అయ్యన్నపాత్రుడు బుధవారం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును సందర్శించారు. ముందుగా ఆయన అల్లూరి సమాధికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్కు పరిసరాలను పరిశీలించి అభివృద్ధి చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.