మెదక్-జోగిపేట రహదారిపై యాక్సిడెంట్
MDK: మెదక్-జోగిపేట రహదారిపై రంగంపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌడిపల్లి మండలం ఎర్రమట్టి తండాకు చెందిన నునావత్ శాంతి (52) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.