VIDEO: మెట్రోలో ప్రయాణించిన మంత్రి
HYD: నగరంలోని మెట్రో రైలులో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రయాణించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతోందని, ప్రతి ఒక్కరూ సాధ్యమైన మేర ప్రజారవాణా సేవలను వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.