జాతీయ రహదారిపై పశువులు పట్టివేత

జాతీయ రహదారిపై  పశువులు పట్టివేత

SKLM: రణస్థలం M జె.ఆర్. పురం రామ తీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి విశాఖ పట్నం వైపు తరలిస్తున్న పశువులను పట్టుకుని గుజ్జింగివలస గోశాలకు తరలించారు. ఇద్దరు నిందితుల పై జె.ఆర్.పురం ఎస్సై ఎస్. చిరంజీవి కేసు నమోదు చేశారు.