కొండవీడు కోటలో టెంట్ వసతి ప్రారంభం
పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటలో రాత్రి టెంట్ వసతి సేవలు ప్రారంభమైనట్లు కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. అటవీ శాఖ సహకారంతో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని, 10 మంది సభ్యులతో వచ్చే బృందాలకు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముందుగా 9000593392, 9966056126 నంబర్లను సంప్రదించాలన్నారు.