పశువులకు గాలికుంటు టీకాలు

పశువులకు గాలికుంటు టీకాలు

NGKL: వంగూరు మండలం జాజాల గ్రామంలో సోమవారం సర్పంచ్ కాశమ్మ ఆధ్వర్యంలో పశు వైద్యశాఖ అధికారులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. వ్యాధుల నివారణకు రైతుల ముందుగానే పశువులకు టీకాలు వేయించాలని, పశువులకు భీమా చేయించుకోవాలని సూచించారు. వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.