హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు
SRD: ఆభరణాల కోసం హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర గురువారం తీర్పు ఇచ్చారు. సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ 19-11-2024 రోజున పొలంలో పత్తి తీస్తుంది. ఆమె భర్త లేని సమయం చూసి నిందితుడు నిరుడు చంద్రయ్య లుంగీ బట్టతో గొంతుకు బిగించి రాయితో తలపై కొట్టి చంపి ఆమె చెవి కమ్మలు, కాళ్ళ కడియాలను దొంగలించాడు.