VIDEO: ఈదరపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
E.G: అమలాపురం మండలం ఈదరపల్లిలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో సోమవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణ సీఐ వీరబాబు, ఎస్సై కిషోర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల పరిరక్షణపై స్థానికులకు అవగాహన కల్పించారు. రాత్రి సమయాల్లో గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ సూచించారు.