జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

BPT: అద్దంకిలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను కమిషనర్ రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంత్రి రవికుమార్ సహకారంతో జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతి, యువకులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.