40 గంటలు.. 460 పాటలతో కొత్త రికార్డు
కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన 136 మంది గాయకులు అద్భుత రికార్డు సృష్టించారు. బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్‌కు చెందిన 460 పాటలను ఏకధాటిగా 40 గంటలపాటు ఆలపించి కొత్త రికార్డు నమోదు చేశారు. తద్వారా గతంలో అహ్మదాబాద్‌లో 100 మంది గాయకులు 36 గంటలపాటు పాటలు పాడిన రికార్డును వీరు అధిగమించారు.