VIDEO: కేటీఆర్ పై కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
SDPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేల ప్రస్తావన తెచ్చిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పదేళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్ల కొనుగోలుకు తెరలేపారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6 వేలు పంచిన ఘనత బీఆర్ఎస్ దే అని ఆరోపించారు.