తాడిగడపలో పర్యటించిన ఎమ్మెల్యే బోడే
కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు, యనమలకుదురు గ్రామాలలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కాలువలు, త్రాగునీరు, వీధి దీపాలు వంటి అంశాలను పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి, నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.