క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ల నిర్వహణ అభినందనీయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి పోటీలు ప్రారంభించారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులను, టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు.