'ఆదివారం కూడా విద్యుత్ బిల్లు చెల్లించవచ్చు'
ప్రకాశం: జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వల్ల పెనాల్టీ పడదని, ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు. వినియోగదారుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు.