వామ్మో.. కరెంటు బిల్లు చూసి షాక్..!

మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ సూరారం దొమ్మర పోచంపల్లి పరిధిలో ఓ వినియోగదారుడు కరెంట్ బిల్ చూసి షాక్ అయ్యాడు. రూ.7 వేలకు పైగా కరెంట్ బిల్లు రావటం ఏంటని అధికారులను ప్రశ్నించారు. రెండు నెలలుగా అధిక బిల్లులపై కస్టమర్లు అడిగినా ఏఈ, మీటర్ రీడింగ్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదన్నారు. సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగిందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.