కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమం, చదువుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. 6వ, 10వ తరగతులు, ఇంటర్ తరగతులను పరిశీలించారు. వసతి గృహం, భోజనశాల, డైనింగ్ హాల్, ఆర్‌ఓ ప్లాంట్, నిత్యావసర వస్తువుల నిల్వలను తనిఖీ చేశారు.