గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు

గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు

వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు సంస్థలు మరింత పెంచాయి. డబుల్ సిలిండర్ ఉంటే బుకింగ్ మధ్య కనీసం 35 రోజులు ఉండాలని తెలిపాయి. మొదట్లో 21 రోజులు ఉండగా మార్చి రెండో వారంలో 25 రోజులకు, తాజాగా 35 రోజులకు పెంచడం గమనార్హం. సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాతే బుక్ చేయాల్సి ఉంటుంది. పీఎంయూవై వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచారు.