శీతాకాలం.. ఉసిరి తింటున్నారా?
శీతాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడటంతో త్వరగా రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలో పోషకాల గని ఉసిరి సహజ ఔషధంగా పనిచేసి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి. ఫలితంగా జీర్ణక్రియ, చర్మ, కేశ సంరక్షణ, గుండె, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.