బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా కుబేర్ నాథ్
KRNL: ఆదోనికి చెందిన బత్తిని కుబేర్ నాథ్‌ను జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా కుబేర్ నాథ్ తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.