భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

SRPT: హుజూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.