VIDEO: చాగంటి పాదాలకు నమస్కరించిన మంత్రి లోకేష్
GNTR: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సదస్సులో ఇవాళ రాష్ట్ర నైతిక విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనను మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలుకుతూ పాదాలకు నమస్కరించారు. వీరిరువురు కాసేపు ముచ్చటించారు. అనంతరం చాగంటి జ్యోతిప్రజ్వలన గావించి, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.