VIDEO: క్వారీలో ఈతకు వెళ్లి విద్యార్థి అదృశ్యం
అన్నమయ్య: రాయచోటి సమీపంలోని ఏకిలపల్లె క్వారీ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. మాసాపేటకు చెందిన జాబిద్ అనే 10వ తరగతి విద్యార్థి పరీక్ష అనంతరం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బాలుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.