VIDEO: పోలీసుల జోక్యం.. కార్పొరేటర్లకు గాయాలు..!
VSP: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిరసనలను అడ్డుకునే క్రమంలో పోలీసులు కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించడంతో ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో వైకాపా కార్పొరేటర్ బళ్ళ లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. అధికార-ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య భౌతిక దాడులు చోటుచేసుకున్నాయి. గందరగోళం మధ్యే 15వ అంశం ఆమోదమైందని మేయర్ ప్రకటించారు.