ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి
అన్నమయ్య: చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.