త్వరలో అందుబాటులోకి రైల్వే స్టేషన్

MHBD: అమృత్ భారత్ పథకం కింద మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 92% పనులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.