రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు
ఖమ్మం జిల్లాలోని గ్రామపంచాయతీల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ గడువు ఇవాళ మ.3 గంటల వరకు ఉండటంతో రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు. ఈసారి తప్పుకో.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామంటూ ఆయా గ్రామ పంచాయతీల నాయకులు చర్చలు సాగిస్తున్నారు.