రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అన్నమయ్య: మదనపల్లె మండలం కాశీరావుపేట వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బైకును ఢీకొనడంతో పూలవాండ్లపల్లెకు చెందిన శేషాద్రిరమణ (36) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారులో ఉన్న మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.