చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

BDK: జిల్లాలో చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకునేందుకు ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మరింత వేగంగా న్యాయ పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.