ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి సవితకు వినతిపత్రాలు అందజేశారు. అందిన వినతులను పరిశీలించిన ఆమె సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.