చిత్తూరులో APK ఫైల్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక
CTR: పెరుగుతున్న APK ఫైల్ మోసాలపై ప్రజలను అప్రమత్తంగా ఉండమని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి హెచ్చరించారు. తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు, గూగుల్ ప్లే స్టోర్ వంటి అధికారిక వేదికల నుంచే యాప్‌లు మాత్రమే డౌన్‌లోడ్ చేయాలన్నారు. OTPలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.