'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల అందజేస్తాం'

SRPT: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల అందజేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం చివ్వెంల మండలం బండమీది చందుపట్లలో కాంగ్రెస్ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదన్నారు.