VIDEO: లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, హౌసింగ్ డీఈ పురుషోత్తం, తహసీల్దార్ విజయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.