కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి MLA పరామర్శ
MNCL: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బెల్లంపల్లి పట్టణం 28వ వార్డు కాంగ్రెస్ నాయకులు MD. రఫీ కుటుంబ సభ్యులను MLA వినోద్ శుక్రవారం పరామర్శించారు. రఫీ, అతని సతీమణి మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.